నేడు కొమురెల్లి మల్లన్న కల్యాణం

0
24

జిల్లాల పునర్విభజన తర్వాత వరంగల్ నుంచి సిద్దిపేట జిల్లాలో కలిసిన కొమురవెల్లి మల్లన్న కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లుచేశారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు మల్లికార్జునస్వామి, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల కల్యాణ మహోత్సవానికి భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఏటా మార్గశిర మాసంలో చివరి ఆదివారం మల్లికార్జునస్వామి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ప్రభుత్వం తరఫున స్వామివారికి భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. 30 కిలోల వెండితో తయారుచేసిన సింహాసనంపై కల్యాణాన్ని నిర్వహించనున్నారు.

LEAVE A REPLY