నేడు అసెంబ్లీ, కౌన్సిల్‌లో చేనేత స్టాల్స్ ప్రారంభం

0
34

తెలంగాణ: చేనేత వస్ర్తాల విక్రయాలు పెరిగే విధంగా చేనేత లక్ష్మి పథకాన్ని ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తీసుకరావాలని టెస్కో అధికారులు నిర్ణయించారు. చేనేత లక్ష్మిలో చేరడం ద్వారా చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవడమే కాకుం డా వినియోగదారులకు ప్రోత్సాహకరంగా ఉం టుంది. అయితే ప్రస్తుతమున్న విధానంలో టెస్కో షోరూంలకు వెళ్లి సభ్యత్వం తీసుకోవాలి. ఆన్‌లైన్‌లోనూ ఈ పథకంలో చేరే సౌకర్యం కల్పిస్తే మంచి స్పందన వస్తుందని సూచనలు రావడంతో టెస్కో అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్కో వెబ్‌సైట్ HTTP: //TSCO.CO.IN ద్వారానే ఆన్‌లైన్ సభ్యత్వం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో చేరే విధానం అందుబాటులోకి రానుందని అధికారులు చెప్పారు. సభ్యత్వం తీసుకోవడంతోపాటు ప్రతి నెల చేసే చెల్లింపులకు సైతం ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించనున్నామని తెలిపారు. ప్రస్తుతమున్న వెబ్ సైట్‌ను అధునీకరించాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆదేశించారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here