నేటి నుంచి మొగల్ గార్డెన్స్ సందర్శన

0
16

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం వార్షిక ఉద్యానోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్‌లోని మొగల్ గార్డెన్స్‌ను సందర్శించేందుకు ప్రజలకు ఆదివారం నుంచి అనుమతి స్తారు. మార్చి 12వతేదీ వరకు రోజూ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు సందర్శించ వచ్చు. నిర్వహణ పనుల నిమిత్తం ప్రతి సోమవారం గార్డెన్స్‌ను మూసివేస్తారు. రాష్ట్రపతి భవన్‌లోని స్పిరిచ్వ ల్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, బొన్సాయ్ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్‌లను చూడవచ్చు. మొగల్ గార్డెన్స్‌ను సందర్శించేందుకు వచ్చిపోయేవారు రాష్ట్రపతి భవన్‌లోని ఉత్తరాన ఉన్న గేట్ నంబర్ 35ని ఉపయోగించాలి.

LEAVE A REPLY