నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్.. బరిలో ఆరు జట్లు.

0
30

తెలంగాణ:క్రీడాభిమానులకు పండుగే పండుగ. ఈనెల 1న పీబీఎల్ మొదలవుతుంటే..2వ తేదీన ప్రో రెజ్లింగ్ లీగ్(పీడబ్ల్యూఎల్) ప్రారంభమవుతున్నది. ఈ యేడాది ఆరంభం నుంచే అభిమానులను లీగ్‌లు అలరించబోతున్నాయి. గత సీజన్‌కు కొనసాగింపుగా పీబీఎల్ సరికొత్త రీతిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఆరు ఫ్రాంచైజీలు పోటీపడుతున్న లీగ్ ప్రారంభోత్సవ వేడుకలకు హైదరాబాద్ వేదిక అవుతున్నది. ఈ టోర్నీలో ఢిల్లీ ఏసర్స్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, ప్రపంచ టాప్ షట్లర్ కరోలినా మారిన్ చేరికతో లోకల్ టీమ్ హైదరాబాద్ హంటర్స్ బలం మరింత పెరిగింది. భారత బ్యాడ్మింటన్ క్వీన్ సింధు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్‌తో హైదరాబాద్ తలపడుతున్నది.

LEAVE A REPLY