నెల రోజుల్లో టెండర్లు నిర్వహిస్తం

0
30

వచ్చే ఏ డాదిలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టులో చివరి ఆయకట్టు వరకూ సాగునీటిని అందిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టులో సాగు భూములు బీళ్లుగా మారడానికి 60 ఏళ్ల సమైక్య పాలనే కారణమన్నా రు. అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పటేల్ విష్ణువర్ధన్‌రెడ్డితో సహా పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గంతో స్వ యంగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఏళ్లుగా బీళ్లుబారిన భూ ములను సస్యశ్యామలం చేసేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రూ.783 కోట్లతో నిర్మాణం చే స్తున్నామన్నారు.

ఈ నెలలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది నాటికి పనులు పూ ర్తి చేసి సాగు నీరందిస్తామన్నారు. తుమ్మిళ్ల అనుమతుల కోసం కొంత అడ్డంకులు ఎదురైనా నడిగడ్డ ప్రాంత ప్రజల కోసం తుమ్మిళ్లను నిర్మాణం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. తుమ్మిళ్ల లిప్ట్‌తో ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల గోస తీరుతుందన్నారు. ఏడాదిలోగా తుమ్మిళ్లను ని ర్మించి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని ప్రకటించారు. ఆర్డీఎస్ ఆ యకట్టు రైతులు 60 ఏళ్లుగా అరిగోస పడుతున్నా సమైక్య పాలకులు పట్టించుకోలేదన్నారు. ఆర్డీఎస్ రైతుల సాగునీటి కష్టాలకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమన్నారు. రైతులను ఆగం చేసిన చరిత్ర సమైక్య పాలకులదన్నారు. ఉద్యమ స మయంలో ఇక్కడి నుంచి పాదయాత్ర చేసిన సీఎం కేసీఆర్.. ఇక్కడి రైతుల కష్టాలను కళ్లారా చూశారని, వారి కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకే తుమ్మిళ్లను మంజూరు చేశామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here