నెట్లో చూసి నాటు తుపాకీ తయారీ

0
12

అంతర్జాలంలో చూసి నాటు తుపాకీని తయారు చేసి గాల్లోకి కాల్పులు జరిపిన యువకుడిని తూప్రాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. తూప్రాన్‌ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపిన వివరాల మేరకు..విజయనగరం జిల్లా బాడంగి మండలం కోడూర్‌కు చెందిన మార్దాన రమేశ్‌(26) ఐటీఐ పూర్తి చేశాడు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రామాయపల్లి పంచాయతీ పరిధి పాలట శివారులోని ఓ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. పరిశ్రమలో ఉండే ఇనుప పరికరాలతో నాటు తుపాకీని తయారు చేయాలనుకున్నాడు. అంతర్జాలంలోని వీడియోల ఆధారంగా నాటుతుపాకీతోపాటు తూటాలనూ తయారు చేశాడు. నాలుగు రోజుల క్రితం అతను ఉంటున్న గది పక్కన ఒక రౌండ్‌ గోడకు కాల్పులు జరిపి తుపాకీ పని తీరును గమనించాడు

LEAVE A REPLY