నూతన సంవత్సర వేడుకల్లో లైంగిక వేధింపులు

0
38

బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు యువతులకు పీడకలగా మారాయి. తీవ్ర మనోవేదనను మిగిల్చాయి. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని డిసెంబర్ 31న రాత్రి బెంగళూరు నగరంలో 10వేల మంది పోలీసులను నియమించారు. అయినా, అర్ధరాత్రి తాగుబోతులు, పోకిరీలు రెచ్చిపోయారు. యువతులు ఎక్కడ కనిపించినా వేధించడం మొదలు పెట్టారు. ఎంజీ రోడ్డులో దాదాపు 60వేల మంది జనం పోగయ్యారు. దాదాపు 1500మంది పోలీసులు విధుల్లో ఉన్నా.. రెచ్చిపోయిన తాగుబోతులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒంటరి యువతులను లక్ష్యంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గేలిచేస్తూ వెంటపడి తరిమారు. దీంతో దిక్కుతోచని వారు సహాయం కోసం పరుగులు తీశారు. చెప్పులు చేతిలో పట్టుకుని అల్లరిమూక నుంచి దూరంగా వెళ్లిన యువతులు దగ్గరలో ఉన్న మహిళా పోలీసులను పట్టుకుని కంటతడి పెట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిశ్చేష్టులై ఉండడం వివాదాస్పదమైంది. కబ్బన్ పార్క్ ఠాణా ఇన్‌స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ వేధింపులకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు 60వేల మంది వరకు వచ్చారని తెలిపారు. భద్రత కోసం1600మంది పోలీసులను నియమించామని, పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నాయని, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరుగలేదని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here