నీరు, విద్యుత్ యాజమాన్యంలో ఆంధ్ర ఆదర్శం

0
20

విభజన తర్వాత విద్యుత్, నదీ జలాల యాజమాన్యంలో ఆంధ్రప్రదేశ్.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, విద్యుత్ మంత్రి పీయూష్‌ గోయల్‌ అభినందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఉమాభారతి చెప్పారు. నదుల అనుసంధానంతో ఆయన దేశానికి సైతం దారిచూపారని ప్రశంసించారు. ప్రతిష్ఠాత్మక సీబీఐపీ జాతీయ అవార్డులను వారు గురువారం ఢిల్లీలో అందజేశారు. ఆంధ్ర విద్యుత్ సంస్థలు మరోసారి ఈ అవార్డులను సొంతంచేసుకున్నాయి. జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరచినందుకు విద్యుదుత్పత్తి యాజమాన్యంలో ఏపీ జెనకో సీఎండీ కె. విజయానంద్‌ తరపున సీజేఎం భాస్కర్‌, ఇంధన పొదుపు, సంరక్షణ విధానాల అమలులో రాష్ట్ర ఇంధన సంరక్షణ సమితి (ఏపీఎస్ఈసీఎం) సీఈవో చంద్రశేఖరరెడ్డి వీటిని అందుకున్నారు. కార్యక్రమం తర్వాత కేంద్ర మంత్రులతో ఈయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో విద్యుత్, నదీ జల యాజమాన్య విధానాలను ఉమాభారతి, గోయల్‌ మెచ్చుకున్నారు.

LEAVE A REPLY