నిహారిక పెళ్లి వార్తలపై స్పందించిన నాగబాబు

0
94

మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి విమర్శలు .. రూమర్లు వచ్చినా, వెంటనే నాగబాబు తనదైన శైలిలో వాటిని ఖండిస్తూ ఉంటారు. అసలు విషయాన్ని స్పష్టం చేయడానికి .. అవతలివారిపై మండిపడటానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. ముక్కుసూటిగా తాను చెప్పదలచుకున్నది చెప్పేస్తుంటారు.

ఈ మధ్య సాయిధరమ్ తేజ్ .. నిహారిక కుటుంబాల మధ్య పెళ్లి మాటలు జరుగుతున్నాయనే ఒక వార్త షికారు చేసింది. ఆ విషయాన్ని గురించి తాజాగా నాగబాబు స్పందిస్తూ, అదొక ఫూలిష్ న్యూస్ అని అన్నారు. ఏ దరిద్రుడో ఆ వార్తను క్రియేట్ చేసి వుంటాడని చెప్పారు. నిహారికను తేజు ఎత్తుకుని తిరిగేవాడనీ .. వాళ్లిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెళ్ల మాదిరిగా పెరిగారని అన్నారు. పనీపాటా లేని వాళ్లు సృష్టించే పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here