నిషేధాన్ని తొలగించేది లేదు

0
28

తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని పునఃసమీక్షించాలని పరిపాలన కమిటీ (సీవోఏ)కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ చేసుకున్న విజ్ఞప్తిని బీసీసీఐ తోసిపుచ్చింది. క్రికెటర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ శ్రీకి.. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ లేఖ రాశారు. అవినీతిని రూపుమాపడమే తమ లక్ష్యమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని వెల్లడించారు. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం కొనసాగుతుంది. కాబట్టి ఏ ఫార్మాట్‌లోనూ అతను క్రికెట్ ఆడేందుకు అర్హుడు కాదు. నిషేధంపై క్రికెటర్ కేరళలోని కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి మా న్యాయ బృందం సమాధానం ఇస్తుంది. ఆటలో అవినీతి లేకుండా చూడటమే బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని ఏ కోర్టూ చెప్పలేదు. అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను మాత్రమే కింది కోర్టులు తోసిపుచ్చాయి అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here