నివేదించాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు

0
18

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చెల్లుతుందా? చెల్లదా? అనే అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు తొమ్మిది ప్రశ్నలను రూపొందించిన సుప్రీంకోర్టు.. వాటిపై రాజ్యాంగ ధర్మాసనమే న్యాయనిర్ణయం చేసి సాధికారిక ప్రకటన చేస్తుందని పేర్కొంది. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమించనున్నారు. ఇక.. రద్దు చేసిన రూ.500, 1000 నోట్లను బిల్లులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చెల్లింపులకు, రైలు టికెట్ల కొనుగోళ్లకు అనుమతించేలా ఆదేశాలివ్వాలన్న(మినహాయింపుల పొడిగింపు) విజ్ఞప్తిని చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. పాత నోట్ల వినియోగం పొడిగించాలా వద్దా అన్నది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here