నిలకడగా కరుణానిధి ఆరోగ్యం

0
22

డీఎంకే అధినేత ఎం కరుణానిధి (92) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శుక్రవారం చెన్నైలోని కావేరి దవాఖాన వైద్యులు వెల్లడించారు. శ్వాస సంబంధిత సమస్యతో హాస్పిటల్ చేరిన ఆయనకు ట్రాకియోస్టోమి చికిత్స అందించామని, దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని కావేరి హాస్పిటల్ ఈడీ అరవిందన్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు యాంటీ బయోటిక్స్ అందిస్తున్నామన్నారు. శ్వాస సంబంధిత సమస్యతో గురువారం రాత్రి చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో కరుణానిధి చేరిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY