నిర్భయ’ దోషులపై ‘సుప్రీం’ స్పష్టీకరణ

0
11

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు మరణ శిక్షే సరి అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పును ఖరారు చేసింది. న్యాయం పేరిట తమను హత్య చేస్తున్నారని, కింది కోర్టులు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించాలని నిందితులు ముఖేష్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించడానికి తగిన కారణాలు ఏమీ నిందితులు చెప్పలేదని స్పష్టం చేసింది.

LEAVE A REPLY