నిరుపేదలకు డిజిటల్ పాఠాలు!

0
14

అంజనా నాన్న బ్యాంక్ ఉద్యోగి. అమ్మ టీచర్‌గా పనిచేస్తుండేది. పుట్టినప్పటి నుంచి తండ్రి ఆమెని ముద్దాడలేదు, కనీసం దగ్గరికి తీసుకోలేదు. కారణం అంజనా ఆడిపిల్ల కావడమే. పైగా అంజనాని ఏదైనా అనాథ శరణాలయంలో వదిలేయాలనీ చూశాడు. అది నచ్చని అంజనా తల్లి ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. ఎన్నో అడ్డంకులను ఎదిరిస్తూ ఆ బిడ్డను చదివించింది. ఆ క్రమంలో అంజనా స్కూల్లో, చుట్టు పక్కన వాళ్లతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. వారందరినీ తప్పించుకోవాలంటే తను మంచి స్థాయిలో నిలబడాలని చిన్న వయసులోనే నిర్ణయించుకున్నది. అందుకోసం పట్టుదలగా చదివింది. స్నేహితులు కూడా ఆమెను అవమానించడంతో.. పుస్తకాలనే నేస్తాలుగా చేసుకున్నది. స్కూల్లో, కాలేజీలో ర్యాంకులు సాధించి ఒక ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. మొత్తానికి ఆమె కల నెరవేరిందనుకున్నది. కానీ అప్పుడే కొలీగ్స్ ఆమెకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. వీకెండ్స్‌లో స్లమ్ ఏరియాల్లో పిల్లలకు చదువు చెప్పేందుకు అంజనాని కూడా తీసుకెళ్లేవారు. ఆ పని ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది. కానీ ఇలా ఎక్కువ మందికి చేరువకాలేమనిపించింది. ఇది చేస్తూనే.. వారికి మంచి చదువు అందించాలనుకున్నది. ఆ ఆలోచనల నుంచే గ్లోబల్ క్లాస్‌రూమ్‌కు చేసింది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా పిల్లలకు పాఠాలు నేర్పడమే ఆ తరగతి గది ప్రత్యేకత. ఆ రోజు మా నాన్న మమ్మల్ని వదిలేయకపోతే ఈ మంచి ఆవిష్కరణ రూపుదాల్చేది కాదేమో అంటున్నది అంజనా

LEAVE A REPLY