నిద్రిస్తున్న వారిమీదకు దూసుకెళ్లిన కారు

0
12

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిమీద నుంచి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మరణించారు. ముగ్గు రు తీవ్రంగా గా యపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శాస్త్రినగర్‌లో గుజరాత్ హౌసింగ్ బోర్డు భవనం పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారి మీద ఒంటిగంటకు కారు అదుపు తప్పి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. మృతులను భాగాభాయ్ మార్వాడి, లక్ష్మీ మార్వాడిగా గుర్తించారు. వీరు భార్యాభర్తలు. ప్రమాదం జరిగిన తరువాత కారు డ్రైవరే అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులను దవాఖానకు తరలించాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY