నితిన్ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్

0
35

లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నితిన్ ఇటీవల తన తర్వాతి ప్రాజెక్ట్ కి సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రంను రౌడీ ఫెలో సినిమాతో డైరక్టర్ గా ఆరంగేట్రం చేసిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య తెరకెక్కించనున్నాడు. తాజాగా ఈ చిత్రానికి ‘LIE’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తాజాగా ఈ టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించగా, నితిన్ లేటెస్ట్ మూవీకి ఇదే టైటిల్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. లై అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ లైయర్ గా కనిపిస్తాడని అనుకోవడం పొరపాటు అని, ఈ హీరో ప్రేమకు ఎండ్ లేదనేది (LOVE IS ENDLESS) నితిన్ సినిమా టైటిల్ మీనింగ్ అని కొందరు చెబుతున్నారు. 2017 మొదటి భాగంలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here