నా వ్యాఖ్యల వల్లే 1996 ఎన్నికల్లో జయ ఓటమి: రజనీకాంత్

0
25

తన వ్యాఖ్యల వల్లే 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత ఓటమి పాలయ్యారని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన జయ, చో రామస్వామిలకు ఆదివారం సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో రజనీకాంత్ మాట్లాడుతూ తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఘనంగా నివాళులు అర్పించారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయకు వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు. నాటి ఎన్నికల్లో ఒకవేళ జయలలిత తిరిగి గెలిస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడని రజనీ వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలవ్వడంతో జయ బాధపడ్డారన్నారు. ఆ తర్వాతే ఆమె మంచి మనస్సున్న నేతగా ఆవిర్భవించారన్నారు. నాటి ఎన్నికల్లో డీఎంకే టీఎంసీ (తమిళ మనీలా కాంగ్రెస్) కూటమి ఘన విజయం సాధించాయి. పురుషాధిక్య సమాజంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ఎదిగిన జయ ఒక కోహినూర్ వజ్రం అని కొనియాడారు. చో రామస్వామికి కూడా నివాళులర్పించిన రజనీ ఆయన తనకు సుదీర్ఘకాలంగా స్నేహితుడని చెప్పారు.

LEAVE A REPLY