నా పాలన.. నా ఇష్టం!

0
36

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణయం… ఒబామాకేర్‌ను రద్దు చేయటం. అమెరికన్లందరికీ ఆరోగ్యపరంగా భరోసాను కల్పిస్తూ ఒబామా తీసుకొచ్చిన ఈ విధానాన్ని ట్రంప్ తొలగించారు.
-జనవరి 20వ తేదీని జాతీయ దేశభక్త దినంగా ప్రకటించారు. తాను ప్రమాణం చేసిన రోజుకు ఈ విధంగా అమెరికా చరిత్రలో స్థానం కల్పించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
-మెరికా అధ్యక్షుడు తన బంధుమిత్రులకు ప్రభుత్వంలో ఉన్నత పదవులు కట్టబెట్టటానికి వీల్లేదు. ఈ మేరకు అక్కడ బంధుప్రీతి నిరోధక చట్టం కూడా ఉంది. దీనిని పట్టించుకోకుండా ట్రంప్ తన అల్లుడిని ప్రభుత్వ సీనియర్ సలహాదారునిగా నియమించారు.
-12 దేశాలతో కూడిన మహా పసిఫిక్ దేశాల ఒప్పందం (టీపీపీ) నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. వాస్తవానికి ఈ ఒప్పందాన్ని రూపొందించింది అమెరికానే.
-మహిళలు అవాంఛిత గర్భం ధరించకుండా అబార్షన్లను ప్రోత్సహించి అందుకు సాయపడే స్వచ్ఛందసంస్థలకు నిధులను ట్రంప్ నిలిపివేశారు.
-కళలు, సామాజికశాస్ర్తాలు, న్యాయసేవలు, మైనార్టీల వ్యాపారాభివృద్ధి, ప్రజాప్రసారాలు, పునరుత్పాదక ఇంధనం, సమర్థ ఇంధన వినియోగం వంటి ప్రాజెక్టులు, మహిళలపై హింసను వ్యతిరేకించే కార్యక్రమాలకు నిధులను ఇవ్వాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రతిపాదించారు.
-స్పానిష్ భాషలో ఉన్న వైట్‌హౌస్ అధికారిక వెబ్‌సైట్‌ను తొలగించారు.
-పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్న రెండు భారీ చమురు, గ్యాస్ ప్రాజెక్టులపై ఒబామా హయాంలో విధించిన నిషేధాన్ని ట్రంప్ తొలగించారు.
-అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియా నుంచి అమెరికాకు తరలి వచ్చే శరణార్థుల రాకపై నిషేధం విధించారు.
-ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉండే ఏడు దేశాలు – ఇరాక్, ఇరాన్, సిరియా, సొమాలియా, లిబియా, సుడాన్, యెమెన్‌ల ప్రజలు అమెరికాకు రాకుండా మూడు నెలల నిషేధం విధించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన అటార్నీ జనరల్ సాలీయేట్స్‌ను పదవి నుంచి తొలగించారు. నిషేధిత జాబితాలో పాకిస్థాన్‌ను కూడా చేర్చే అవకాశం ఉందని అమెరికా అధికారవర్గాలు వెల్లడించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here