నా కోసం కాదు.. మీ కోసమే

0
25

‘రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడం, ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం వంటి అంశాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తే.. మీరంతా వారికి దగ్గరవుతారనే ఉద్దేశంతోనే 145 రోజుల పాటు ‘గడప గడపకూ వైఎస్‌’ కార్యక్రమం నిర్వహించాలని సూచించాను. దీనిని ఎంత విస్తృతంగా ప్రజల్లోకి తీసువెళ్తే .. మీరు వారికి అంత చేరువవుతారు. కానీ సీనియర్‌ నేతలు సహా అందరూ దీని నిర్వహణలో వెనుకబడ్డారు. ఇది మంచిది కాదు. ఈ కార్యక్రమం నాకోసం కాదు. మీ కోసమే. ప్రజల్లోకి వెళ్తే మీ రాజకీయ భవిష్యతకే మంచిది. మీరే ఎమ్మెల్యేలవుతారు. అందుకే ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది మార్చి దాకా పొడిగిస్తాం. ఇప్పటిదాకా ఈ కార్యక్రమంలో వెనుకబడ్డ వారంతా.. ఇకనైనా జోరు పెంచండి’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

LEAVE A REPLY