నా ఆస్తులు వారిద్దరికీ సమానంగా ఇస్తా

0
26

తాను చనిపోయిన తర్వాత తన కుమార్తె శ్వేతానందా, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌లకు తన ఆస్తులు సమానంగా చెందుతాయని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా పేర్కొంటూ.. ఒక ప్లకార్డు పట్టుకుని ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. వుయ్‌ ఆర్‌ ఈక్వల్‌, జెండర్‌ ఈక్వాలిటీ అన్న హ్యాష్‌ట్యాగ్‌లను జతచేస్తూ.. ‘నేను చనిపోయినప్పుడు నాకు ఉన్న ఆస్తులన్నీ నా కుమార్తె శ్వేతానందా, కుమారుడు అభిషేక్‌లకు సమానంగా చెందుతాయి’ అని ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం అమితాబ్‌ ‘సర్కార్‌ 3’ చిత్రంలో నటిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మనోజ్‌ బాజ్‌పాయీ, జాకీ ష్రాఫ్‌, యామీ గౌతమ్‌, అమిత్‌సాద్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here