నామ్ షబానా!

0
25

కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న తాప్సీ గత కొంతకాలంగా తన పంథాను మార్చుకుంది. అభినయానికి ఆస్కారమున్న పాత్రలతో ప్రతిభను చాటుతోంది. బేబీ, పింక్ చిత్రాల్లో అద్వితీయ నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకొంది. తాజా చిత్రం నామ్ షబానాతో మరోసారి విలక్షణ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తాప్సీ. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి శివమ్‌నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాప్సీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం చిత్రబృందం విడుదలచేశారు. ఈ పోస్టర్‌లో రెడ్ కలర్ సల్వార్ కమీజ్‌లో తీక్షణమైన చూపులతో ఢీ గ్లామర్ లుక్‌లో ఆకట్టుకుంది తాప్సీ. సమాజంలోని అసమానతలపై పోరాడే ధైర్యవంతురాలైన మహిళగా ఆమె పాత్ర ఛాలెంజింగ్‌గా, సహజత్వంతో కూడి ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కెరీర్‌లో ఇప్పటివరకూ కనిపించిన సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు, వచ్చే ఏడాది మార్చి 31న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తాప్పీ తెలిపింది. తన కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుందని చెప్పింది. అక్షయ్‌కుమార్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY