నాపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం

0
13

ముఖ్యమంత్రికి ఎదిరించి నిలుచున్నానని వారికి అనుకూల మీడియాలో సీఎం చంద్రబాబు నాపై దుష్ర్రచారం చేసి, తనను బద్నాం చేసి పంపించాలనే ప్రయత్నం చేశారని వైసీసీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుకు చాలా మంది వస్తున్నారని, కానీ ఏపీలో మహిళలు, రైతులు, పేదల కన్నీళ్లు తుడవడానికి అడుగడుగున తిరిగిన బృందాకారత్, మేధాపట్కర్ లాంటివాళ్లను సదస్సుకు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. మహిళా సాధికారత మీద డిక్లరేషన్ చేయడానికి వైసీసీ మద్దతు తెలుపుతుందని, కానీ అక్కడికి వచ్చే మనుషులపై తమకు అనుమానం ఉందని, అలాంటివారిపై కూడా డిక్లరేషన్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలపై అరాచకాలుగానీ, అన్యాయంగా వాళ్లను తొక్కేయటంలో చంద్రబాబు ఏపీని అడ్డాగా మార్చేశారని, అలాంటివారు ఈ సదస్సుకు వచ్చే అర్హత లేదని రోజా అన్నారు.

LEAVE A REPLY