నాన్న జీవిత చరిత్రతో సినిమా చేస్తా!

0
23

ఇటీవల విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో చక్కటి విజయాన్ని అందుకున్నారు బాలకృష్ణ. తాజాగా ఆయన తన తదుపరి సినిమాపై సంచలన ప్రకటన చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామమైన నిమ్మకూరుని బాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా తీస్తానని ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని, ఇందులో నాన్న జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్ని చర్చిస్తామని తెలిపారు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి నాన్నగారికి సంబంధించిన మరిన్ని విశేషాలను సేకరించి కథను సిద్ధం చేస్తామని బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమా దర్శకుడు, నిర్మాత వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు.

LEAVE A REPLY