నాని హీరోయిన్ల వెంట పడుతున్న పవన్ కళ్యాణ్

0
30

హైదరాబాద్ : సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే హీరోయిన్లకు ఎంతో ఇష్టం. పవన్‌తో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు. పవన్‌తో సినిమా చేయడానికి క్యూ కడుతారు. అయితే.. పవర్ స్టార్ మాత్రం న్యాచురల్ స్టార్ నాని హీరోయిన్ల వెంట పడుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రం దర్శకత్వంలో వస్తున్న పవన్ కొత్త సినిమా కాటమరాయుడులో ఇద్దరు నాయికలు బుక్కయ్యారు. ఇద్దరూ నానితో నటించిన హీరోయిన్లే. ఒకరు కీర్తి సురేష్, ఇంకోకరు అను ఎమ్మాన్యుయెల్. నేను లోక్ అనే సినిమాలో కీర్తి సురేష్ నటించగా, మజ్ను సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ నానితో రొమాన్స్ చేసింది. వచ్చే ఏడాది త్రివిక్రమ్-పవన్‌ల సినిమా పట్టాలెక్కనుంది.

LEAVE A REPLY