నాటుకోడి’ పాటలు

0
45

తెలుగు చిత్రసీమలో స్వయంకృషితో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు హీరో శ్రీకాంత్. నాటుకోడి టైటిల్‌కు వంద మార్కులు ఇవ్వవచ్చు. సంక్రాంతికి ఈ సినిమా చక్కటి వినోదాల్ని పంచాలి అని అన్నారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నటించిన చిత్రం నాటుకోడి. నాని కృష్ణ దర్శకత్వం వహిస్తూ బందరు బాబీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. యాజమాన్య స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.
ఆడియో సీడీలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంయుక్తంగా ఆవిష్కరించారు. తొలి ప్రతిని హీరో వెంకటేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 25 ఏళ్లుగా కుటుంబ కథలు, వినోదం, సెంటిమెంట్…. అన్ని రకాల పాత్రలతో శ్రీకాంత్ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. మరో 25 ఏళ్లు ఆయన చిత్రసీమలో ఇలాగే కొనసాగాలి. నాటుకోడి టైటిల్, పాటలు, శ్రీకాంత్ పాత్ర అన్ని మాస్ కోణంలో కొత్తగా ఉన్నాయి అని తెలిపారు. ఇందులో పోలీస్ అధికారిగా నటిస్తున్నాను. మాస్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు నానికృష్ణ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు అని శ్రీకాంత్ తెలిపారు. ప్రజల్లో నాటుకుపోయిన అవినీతిని రూపుమాపే ఓ పోలీస్ కథ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్, తరుణ్, శివాజీరాజా, కోటశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here