నాగోల్‌లో క్రిస్టియన్ భవన్

0
26

హైదరాబాద్‌లోని నాగోల్‌కు సమీపంలో క్రిస్టియన్ భవన్‌కు స్థలం కేటాయించి క్రిస్మస్ పండుగకు ముందే అనుమతులిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశమంతా గర్వించే విధంగా క్రిస్టియన్ భవన్‌ను నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కులాల, మతాల, వర్గాల ప్రజలు సందర్భోచితంగా గౌరవించబడి అభివృద్ధి ఫలాలు పొందగలిగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. ఎల్బీ స్టేడియంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సంబురాలు, విందు కార్యక్రమాన్ని నిర్వహించింది.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గౌరవం లభించి, అభివృద్ధి ఫలాలు వారికి అందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశమంతా గర్వించే విధంగా క్రిస్టియన్ భవన్‌ను కట్టాలని భావించామని, అయితే కొన్ని అడ్డుంకుల వల్ల అది సాధ్యపడలేదన్నారు. నాగోల్‌కు సమీపంలో క్రిస్టియన్ భవన్‌కు స్థలం కేటాయించి పండుగకు నాలుగురోజుల ముందే అనుమతులిస్తామని సీఎం స్పష్టం చేశారు.

LEAVE A REPLY