నాగోబాకు మహాపూజ

0
8

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబాకు మె స్రం వంశీయులు శుక్రవారం రాత్రి నిర్వహించిన మహాపూజలతో జాతర ప్రారంభమైంది. మహాపూజలకు వందలాది మంది మె స్రం వంశీయులు, వేలాదిమంది భక్తులు తరలిరావడంతో ఆలయప్రాంగణం భక్తజనసంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులతో కిటకిటలాడింది. మెస్రం వంశం సంప్రదాయం ప్రకారం నాగోబాకు అర్ధరాత్రి గంగాజలంతో మహాపూజలు నిర్వహించారు. దీంతో కేస్లాపూర్ నాగోబా జాతరప్రారంభమై అధికారికంగా ఐదురోజులు కొనసాగనున్నది. నాగోబాకు నిర్వహించే మహాపూజలకు మెస్రం వంశస్తులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. మహాపూజలకు అరగంట ముందు ఆలయంలోని నాగోబాను గంగాజలంతో శుద్ధి చేశారు.

LEAVE A REPLY