నాగబాబు తిట్లకు స్పందించిన వర్మ

0
26
చిరంజీవి నటించిన 150 సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో సెన్సేషనల్ డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మపై నాగబాబు నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో దుమ్మెత్తిపోశారు. అక్షుపక్షి అంటూ విరుచుకుపడ్డారు. చిరంజీవి సినిమాపై కామెంట్లు కాకుండా మొదట సినిమాలు తీయడం నేర్చుకోవాలంటూ ధ్వజమెత్తారు. ఆన్‌లైన్‌లో చేరి కూతలు కూయవద్దని హితవు పలికారు.
నాగబాబు వ్యాఖ్యలపై వర్మ తన స్టైల్లో ట్విట్టర్‌లో స్పందించారు. నాగబాబును ఉద్దేశించి.. ‘‘మీరు ట్విట్టర్‌లో లేరు కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్న ట్వీట్లు మీకు ఎవరైనా చూపిస్తారని అనుకుంటున్నా, మీరంటే నాకెంతో ఇష్టం’’ అని పేర్కొన్నారు. తానోదే తన స్టైల్లో అందరి మీద ఏదో అన్నింటి మీద ట్విట్టర్‌లో స్పందిస్తుంటానని, తన అభిప్రాయమేదో తాను చెబుతుంటానని పేర్కొన్నారు. నిజానికి తనమీద తానే చాలా కామెంట్లు చేస్తుంటానని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వరకు ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని అన్నారు. అయితే తన మాటలకు నాగబాబు హర్ట్ అయినట్టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జెన్యూన్‌గా నాగబాబుకు, ఆయన కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నట్టు ట్వీట్ చేశారు. ‘‘నా ఉద్దేశం వేరే అయినా హర్ట్ అయ్యారు కాబట్టి చిరంజీవి గారికి కూడా నా తరపున దయచేసి క్షమాపణలు చెప్పండి’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here