నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎంపీ కవిత

0
26

కాంగ్రెస్ గెలువాలంటే బాహుబలిలు కావాలి. ఎప్పుడో వచ్చే బాహుబలి కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తున్నది. టీఆర్‌ఎస్‌కు ఆ అవసరం లేదు. మా పార్టీకి సీఎం కేసీయారే బాహుబలి. మాకే కాదు, తెలంగాణ ప్రజలకూ కేసీఆర్ బాహుబలి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే ప్రజలు గెలిపిస్తారుఅని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తంచేశారు. శనివారం ఆమె నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. నవీపేట మండలం నందిగాంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు

LEAVE A REPLY