నవ్వుల బుల్లెట్లు

0
15

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’తో కథానాయకుడైపోయాడు హాస్యనటుడు సప్తగిరి. ఇప్పుడు ‘రివాల్వర్‌ రాజు’గా బుల్లెట్ల వర్షం కురిపించబోతున్నాడు. సప్తగిరి కథానాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. దీనికి ‘రివాల్వర్‌ రాజు’ అనే టైటిల్‌ నిర్ణయించారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం హాస్య నటుడిగా బిజీగా ఉన్నా. చేతిలో చాలా సినిమాలున్నాయి. అయితే మంచి కథ కుదిరింది. అందర్నీ హాయిగా నవ్వించే లక్షణాలు ‘రివాల్వర్‌ రాజు’లో పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు చెబుతా’’ అన్నారు.

LEAVE A REPLY