నల్ల కుబేరులు కటకటా!

0
19

తమిళనాడులోని వేలూరు సమీపంలో ఇసుక మైనింగ్ వ్యాపారి శేఖర్‌రెడ్డి కారు నుంచి రూ.24 కోట్ల నగదును ఐటీ అధికారులు శనివారం జప్తుచేశారు. గురువారం నుంచి శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యాపారవేత్తలకు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో సుమారు 100 మందికి పైగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరి సంస్థలను ప్రేమ్ అనే ఏజెంట్ నిర్వహిస్తున్న సంగతిని అధికారులు గుర్తించారు. ఇప్పటికే రూ.9.63 కోట్ల విలువైన కొత్త రూ.2000 నోట్లు, రూ.96.89 కోట్ల పాత పెద్ద నోట్లు, 127 కిలోల (రూ.36.29 కోట్ల విలువ) బంగారాన్ని స్వాధీనంచేసుకున్నారు. దీంతో శేఖర్‌రెడ్డి నుంచి ఐటీ అధికారులు స్వాధీనంచేసుకున్న మొత్తం నగదు విలువ రూ.166.81 కోట్లకు పెరిగింది. భారీ మొత్తంలో శేఖర్‌రెడ్డి నివాసం నుంచి నగదు, బంగారం లభించడంతోపాటు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినందున టీటీడీ పాలక మండలి సభ్యత్వం నుంచి ఆయనను తొలగించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సంబంధిత శాఖ జీవో విడుదల చేసింది. ఒకవైపు శేఖర్‌రెడ్డి ఇండ్లపై దాడులు కొనసాగుతుండగానే టాటా ఏస్ వ్యాన్‌లో రూ.24 కోట్ల విలువైన రూ.2000 నోట్లను తీసుకెళ్తున్న సమాచారం తెలుసుకున్న ఐటీ అధికారులు ఆ వ్యాన్‌ను వెంటాడి పట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here