నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికేట్ నకిలీది

0
4

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. రూపాయి విలువ తగ్గిపోతోందని, పెట్టుబడులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆరోపించారు. చదువుకున్నవాళ్ళే ప్రధాన మంత్రి అవాలని చెప్పారు. ఆయన గతంలో నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికేట్ నకిలీదని ఆరోపించిన సంగతి తెలిసిందే.

గురువారం కేజ్రీవాల్ ఇచ్చిన ట్వీట్‌లో ‘‘ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్‌లాంటి విద్యావంతుడైన ప్రధానమంత్రిని చేజార్చుకున్నారు. ఇప్పుడు దాని ప్రభావం ప్రజల మీద పడుతోంది. ప్రధాన మంత్రిగా చదువుకున్నవాడే అవాలి’’ అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌తో పాటు ఆయన ఓ అమెరికా పత్రికలో ప్రచురితమైన వ్యాసాన్ని జత చేశారు. భారతదేశ కరెన్సీ విలువ తగ్గిపోతోందని, దీని ప్రభావంతో ఆ దేశ పెట్టుబడుల అవకాశాలు అనిశ్చితిలో పడవచ్చునని ఆ వ్యాసంలో పేర్కొన్నారు

LEAVE A REPLY