నయీం కేసులో ఎవరినీ వదలం

0
25

గ్యాంగ్‌స్టర్ నయీంకేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పరిధిలో ఉన్నదని, ఈ కేసులో ఎవరినీ వదిలేదని లేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు. సీబీఐకి ఎట్టి పరిస్థితుల్లో నయీం కేసును అప్పంగించబోమన్నారు. సిట్ దర్యాప్తులో నేరస్తులను పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రమైన మెదక్‌లో పోలీసు నివాస సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయిని మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. మన పోలీసులు ఫ్రెండ్లీగా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించడానికి రాష్ట్ర పోలీసుయంత్రాంగం కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని పాత పోలీస్‌స్టేషన్లను సుమారు రూ.8 కోట్లతో ఆధునీకరిస్తున్నామని, ఇందులో భాగం గా పోలీసుసిబ్బంది ఫిట్‌నెస్ కోసం జిమ్, రెస్ట్‌రూంలు ఏర్పాటుతో పాటు పలు సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎంత పెద్ద క్రిమినల్ కేసు అయినా 24 గంటల్లోనే పోలీసులు చేధిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని, అయినప్పటికీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహంవ్యక్తంచేశారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాశ్‌రెడ్డి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ చందనాదీప్తి
తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here