నయీం కేసుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టీకరణ

0
30

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించేది లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రశంసలందుకునే సమర్థులైన పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నందున వారితోనే దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో నయీం, అతని అనుచరులు సాగించిన నేర కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున సీఎం సమాధానమిచ్చారు

LEAVE A REPLY