నమ్మించి మోసంచేసిన నగల వ్యాపారి

0
16

నమ్మిన సహచర వ్యాపారులను నట్టేట ముంచాడో నగల వ్యాపారి. శిక్ష నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోయినా చివరికి పోలీసులకు పట్టుబడక తప్పలేదు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఈ కేసు వివరాలు తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రాంతానికి చెందిన బిపిన్ జైన్ (39) మొదట ఒక నగల కంపెనీలో మేనేజర్‌గా పని చేశాడు. తరువాత జెమాలజీ కోర్సు చేసి వజ్రాల నాణ్యతను తెలియజేసే సర్వీసు ప్రారంభించాడు. అనంతరం మార్కెట్లో పలువురితో పరిచయం పెరుగడంతో సొంతంగా బంగారు నగల వ్యాపారం మొదలు పెట్టాడు. స్థానిక వ్యాపారులతో నగలు చేయించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి వారికి అధిక లాభాలను అందించేవాడు.

LEAVE A REPLY