నమితను హారర్ సినిమాలైనా గట్టెక్కిస్తాయా?

0
45
ఒకప్పుడు గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారును హుషారెత్తించిన భారీ అందాల భామకు కొన్నాళ్లుగా అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు వరుస హారర్ చిత్రాలతో అదృష్టం పరిక్షించుకుంటోంది ఆ బొద్దుగుమ్మ.
దిల్ దివానా అంటూ జెమిని సినిమాతో టాలీవుడ్‌కు వచ్చిన నమిత.. ఆ తర్వాత బాగానే అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే సినిమాలతో పాటు బరువు కూడా పెరగడంతో భరించలేమన్నారు తెలుగు జనాలు. దీంతో గత కొన్నాళ్లుగా తమిళ, మలయాళ చిత్రాల్లోనే అతిథి పాత్రలు పోషిస్తోన్న నమిత.. ఇప్పుడో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదో మలయాళ హారర్ సినిమా కావడంతో.. నమిత ఫ్యాన్స్ ఇప్పుడు ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
 మలయాళ చిత్రం “స్పీడ్”తో మెప్పించిన దర్శక ద్వయం నమిత మెయిన్ రోల్‌లో ‘మియా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. నమితతో పాటు సోనియా అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. భర్తతో మనస్పర్ధలు వచ్చిన నమిత.. ఓ దెయ్యం ఇంట్లో చిక్కుకుని ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నది అనేది ఈ సినిమా కథాంశమట. సో, దెయ్యమంటే భయమనే ముద్దుగుమ్మగా ‘మియా’లో నటిస్తోంది బొద్దుగుమ్మ. జూన్‌లో ఈ మూవీ విడుదల కానుందట.

LEAVE A REPLY