నన్ను తప్పించబోతే.. ధోనీ కాపాడాడు..

0
21

స్ఫూర్తి నింపే నాయకుడిగానే కాకుండా రక్షకుడిగాను తన వారసుడు విరాట్‌ కోహ్లీకి భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అండగా నిలిచాడు. సెలెక్టర్లు అతణ్ణి భారత జట్టు నుంచి తప్పించకుండా చాలా సార్లు అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని విరాట్‌ కోహ్లీనే స్వయంగా చెప్పాడు. తన సీనియర్‌పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. కోహ్లీ 2008లో శ్రీలంకపై అరంగేట్రం చేసినప్పటి నుంచి తన అంతర్జాతీయ క్రికెట్‌ మొత్తం ధోనీ సారథ్యంలో ఆడాడు. తొలినాళ్లలో వన్డేలతో పాటు టెస్టుల్లో నిలకడగా రాణించకపోవడంతో జట్టులో అతని స్థానం భద్రంగా ఉండేది కాదు. అయితే, విరాట్‌ ప్రతిభను, అతని సామర్థ్యాన్ని గుర్తించిన మహీ అతనిపై ఎనలేని విశ్వాసం ఉంచాడు. ‘కెరీర్‌ ఆరంభంలో నాకు మార్గనిర్దేశం చేస్తూ అనేక అవకాశాలు ఇచ్చింది మహీనే. నేను క్రికెటర్‌గా ఎదిగేందుకు తగినంత సమయం, జట్టులో చోటు ఇచ్చాడు. జట్టు నుంచి తప్పించకుండా చాలా సార్లు నన్ను కాపాడాడ’ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ చెప్పుకొచ్చాడు. ఇక, కెప్టెన్‌గా ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంటే సాధారణ విషయం కాదన్నాడు. ‘నాయకుడిగా ధోనీని అందుకోవాలంటే ఎన్నో అడుగులు వేయాలి. ధోనీ అంటే మనందరికీ గుర్తొచ్చేది కెప్టెన్‌ అనే. వేరే ఏ రకంగానూ మహీని గుర్తించలేం. అతనెప్పుడూ నా నాయకుడే’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here