నడిచొచ్చే నక్షత్రం ధృవ

0
46

ధృవ (రామ్‌చరణ్‌) ఓ యువ పోలీసు అధికారి. ఎవరిని కొడితే వందమంది క్రిమినల్స్‌ అంతం అవుతారో అతడినే తన లక్ష్యంగా చేసుకొంటాడు. ఆ లక్ష్యం చేరుకొనే క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలు ఎలాంటివి? ఆ ప్రయాణంలో ఎదురైన సిద్ధార్థ్‌ అభిమన్యు (అరవింద్‌ స్వామి) ఎవరు? ఫోరెన్సిక్‌ నిపుణురాలైన ఇషిక(రకుల్‌ప్రీత్‌ సింగ్‌)తో ధృవకి ఎలా పరిచయం ఏర్పడింది? ఆ పరిచయం ఎక్కడిదాకా వెళ్లింది? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.

ప్రత్యేకతలు
తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్‌’కి ఇది రీమేక్‌. రూ.20 కోట్ల వ్యయంతో తెరకెక్కి రూ.వంద కోట్లు వసూలు చేసి తమిళ చిత్రసీమని ఆశ్చర్యపరిచింది ‘తని ఒరువన్‌’. సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన తొలి రీమేక్‌ సినిమా ఇదే. రామ్‌చరణ్‌ తొలిసారి సిక్స్‌ప్యాక్‌ దేహంతో కనిపిస్తాడు. సినిమా మొదలు పెట్టడానికి ముందు ఆయన థాయ్‌లాండ్‌ వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకొచ్చారు. బాలీవుడ్‌కి చెందిన ఫిట్‌నెస్‌ నిపుణుల సమక్షంలో ఆయన ఈ సినిమా కోసం సన్నద్ధమయ్యారు. కశ్మీర్‌లో కొన్ని పాటలతో పాటు కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ‘మగధీర’ తర్వాత గీతా ఆర్ట్స్‌లో రామ్‌చరణ్‌ నటించిన చిత్రమిదే.

LEAVE A REPLY