నటిపై విచక్షణరహితంగా కాల్పులు.. వెంటాడి మరీ 11సార్లు బులెట్ల వర్షం

0
28
లాహోర్: గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో నటి ఒకరు తీవ్రంగా గాయపడి ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని అయిన లాహోర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ స్టేజ్‌షోలో పాల్గొని తిరిగి కారులో ఇంటికి వస్తున్న నటి కిస్మత్ బేగ్‌పై కారు, మోటార్‌ సైకిలుపై వచ్చిన దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. బేగ్ కాళ్లు, పొట్ట, కాళ్లపై 11సార్లు కాల్చారు. తీవ్రంగా గాయపడిన బేగ్, ఆమె కారు డ్రైవర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కారు డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు దర్యాప్తు అధికారి అస్గర్ హుస్సేన్ తెలిపారు. బేగ్ నుంచి విడిపోయిన ఆమె ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఓ పథకం ప్రకారమే ఆమెను హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. థియేటర్ బయట వేచి ఉన్న దుండగులు ఆమె బయటకు రాగానే వెంటాడి మరీ కాల్చారని పోలీసులు తెలిపారు. ‘‘కిస్మత్ ఇక నుంచి నీవు డ్యాన్స్ చేయలేవు’’ అని దుండగుల్లో ఒకరు కాల్చుతూ అరిచినట్టు పేర్కొన్నారు. బేగ్‌పై గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నం జరిగినా ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దర్యాప్తు అనంతరం పూర్తివివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here