నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను

0
31

దళపతి, రోజా, బొంబాయి, మెరుపుకలలు చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించారు అరవింద్‌స్వామి. కెరీర్‌లో తక్కువ సినిమాలే చేసినా నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను చాటుకున్నారు. హ్యాండ్సమ్ హీరోగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారాయన. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేసిన ఆయన ధృవ చిత్రంలో ప్రతినాయకుడిగా అసమాన నటనను ప్రదర్శించారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. తమిళ చిత్రం తని ఒరువన్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా అరవింద్‌స్వామి ఆదివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here