నగరాభివృద్ధికి శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు

0
20

రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయటం లక్ష్యంగా శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం తదితర తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి కరీంనగర్ గేట్‌వేగా ఉంటుందని, ఈ మేరకు నగరాన్ని తీర్చిదిద్దాలన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై బుధవారం ప్రగతి భవన్‌లో విస్త్రృతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ శశాంక్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, సీఎంవో అధికారులు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నా రు. మానేరు రివర్ ఫ్రంట్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.506 కోట్లలో రూ.25 కోట్లను విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఈ సమావేశంలో
సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు నిధులను విడుదల చేశారు.

LEAVE A REPLY