నగరాన్ని శుభ్రంగా ఉంచాలి

0
23

రోడ్లపై వాహనాలు కడిగితే పది వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు, ఆ వాహనదారుడిపై ఆర్‌టీఏలో ఫిర్యాదు చేయాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధికారులను ఆదేశిం చారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇంట్లోని తడి, పొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసి ఆటోరిక్షాల వారికి ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఆదివారం కవాడిగూడ డివిజన్‌లోని గగన్‌మహల్‌లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలోని పలు సమ స్యలు తమదృష్టికి వచ్చాయని, పరిష్కారానికి చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. చాలామంది కార్లను కడుగుతూ ఇంటి ముందున్న రోడ్లను పాడుచేస్తున్నారని అన్నారు. సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచిం చారు. ఆయన వెంట కవాడిగూడ కార్పొరేటర్‌ లాస్య నందిత, సర్కిల్‌ 9ఏ ముకుంద రెడ్డి, ఎఎంహెచ్‌ఓ భార్గవ్‌ నారాయణ, మునిపిల్‌ అఽధికారి పాపమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు దినేష్‌, గోపి, విజయలక్ష్మి, సతీష్‌, శ్యామ్‌ యాదవ్‌, రవియాదవ్‌, శ్యామల, అంబిక, రాములు, రఫియాభాను, లింగం, దశరథ్‌ ఉన్నారు.

LEAVE A REPLY