నగరవాసుల మనసు దోచుకున్న మెట్రోరైలు

0
5

రాజధానిలో రవాణారంగ ముఖచిత్రాన్నే మార్చేసిన మెట్రోరైలు సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మార్గాన్ని 2017 నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మెట్రోరైలు హైదరాబాద్ అందాలకు సరికొత్త సొబగులు అద్దుతూ, నగర ప్రజలకు ఉత్తమ రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆపరేషన్స్ ప్రారంభమైన మొదటి రోజే అత్యధిక మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చి రికార్డు సాధించిన హైదరాబాద్ మెట్రోరైలు.. ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పటివరకు 1.5 కోట్ల మంది ప్రయాణికులను గమస్థానాలకు చేర్చింది. అంటే ఏడు నెలల్లోనే కోటిన్నర మంది మెట్రోలో ప్రయాణించారు. ఇప్పటివరకు మెట్రోరైళ్లు 83 వేల ట్రిప్పులు తిరిగాయి. అంతేకాకుండా మెట్రోరైళ్లు ఇప్పటివరకు 11 లక్షలకు పైగా కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టు అధికారులు చెప్తున్నారు. అంటే కేవలం 30 కిలోమీటర్ల మార్గంలో ఏడు నెలల్లోనే రైళ్లు 11 లక్షల కిలోమీటర్లు తిరిగాయన్నమాట.

LEAVE A REPLY