నగరంలో కాల్పుల ఘటన కలకలం

0
22

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఓ అపార్టుమెంట్‌లో నివాసముంటున్న ఒక గ్రామీణ బ్యాంకు సీఈవోపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అపార్టుమెంట్‌కు వచ్చిన ఆగంతకుడు వాచ్‌మన్‌తో మాట్లాడి, ఆ తర్వాత ఫోన్‌లో సదరు అధికారితోనూ మాట్లా డి ఆయన ఇంటిలోకి వెళ్ళాడు. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నాక హఠాత్తుగా కాల్చి పరారయ్యాడు. గాయపడ్డ బ్యాంకు అధికారి ప్రస్తుతం దవాఖానలో కోలుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా వాసి మన్మథ్ దలాయ్ (62) మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని శ్రీదుర్గా కనుమల్లి అపార్టుమెంట్‌లో తన భార్య సుశ్రీతో కలిసి నివాసముంటున్నారు. మాదాపూర్ కేంద్రంగా ఉన్న కృష్ణ బీమా సమృద్ధి (కేబీఎస్) లోకల్ ఏరియా బ్యాంకు సీఈవోగా పనిచేస్తున్నారు.

LEAVE A REPLY