నగదు రహితానికి చర్యలు తీసుకోండి

0
27

తెలంగాణ:నగదురహిత లావాదేవీల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందుకోసం తీసుకురానున్న టీ వ్యాలెట్ లోగోను ఈ నెల 14న జరిగే కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించనున్నారు. నగదురహిత లావాదేవీలను పెంచేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్.. నగదురహిత గ్రామంగా ఏర్పడి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం కూడా త్వరలోనే ఈ ఘనత సాధిస్తుందని సీఎం చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలు జరుగాలని సీఎం కోరారు. పెద్దనోట్ల రద్దుతోపాటు ఆర్థిక అంశాలపై కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

LEAVE A REPLY