నగదు రహితమే అసలు లక్ష్యం..

0
24

వచ్చే ఏడాది జూన్‌లో 2000 నోటు కూడా రద్దు కానుందా!? కేవలం 500.. ఆలోపు నోట్లు మాత్రమే అమల్లో ఉంటాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే జవాబు ఇస్తున్నాయి విశ్వసనీయ వర్గాలు. నల్ల ధనం కట్టడిలో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే 2000 నోటును కూడా ఉపసంహరించాలని కేంద్రం యోచిస్తోందంటున్నాయి. వాస్తవానికి, పెద్ద నోట్ల రద్దుకు, 2000 నోటు ముద్రణకు సంబంధం లేదని, ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా ముందే 2000 నోటును ప్రవేశ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న వెంటనే 500 నోట్ల కంటే 2000 నోట్లు పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడానికి కారణం కూడా ఇదేనని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం 4 నోట్ల ప్రింటింగ్‌ ప్రెస్‌లు ఉంటే.. ఒక్క దానిలోనే 2000 నోట్ల ప్రింటింగ్‌ జరుగుతోందని తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here