నగదురహిత లావాదేవీల వైపు పయనిద్దాం

0
23

నల్లధనం ఎన్ని రూపాల్లో ఉంటే అన్ని రూపాల్లో దానిని నిర్మూలించాల్సి ఉంటది. కేంద్ర ప్రభుత్వం కేవలం నోట్లు రద్దు చేసి చక్కిలిగింతలు పెడితే అయ్యేది కాదు. నల్లధనం ఏ రూపంలో నైనా ఉంటది. వజ్రాలు, బంగారం, బంగళా, పైసలు, సైట్స్, విదేశీ కరెన్సీ రూపంలో ఉంటది. మారిషస్, మనీలా, సింగపూర్ వంటి దేశాల్లో మనీలాండరింగ్ విధానంలో కూడా ఉండే అవకాశముంది. షేర్ మార్కెట్‌లో కూడా ఉంటది. ఇట్ల అన్ని రూపాల్ల్లో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించాలిగానీ.. కొన్నింటిని చేసి, కొన్నింటిని వదిలేస్తే పూర్తయ్యేది కాదు. అందుకే ప్రధానమంత్రితో నేను ఇదే చెప్పిన. క్రాంతి రావాలిగానీ అది సంపూర్ణ క్రాంతి కావాలని చెప్పిన. ప్రధానమంత్రి కూడా సంపూర్ణ్ క్రాంతి కే తరఫ్ కదమ్ ఉఠాయే అన్నరు. అన్ని రూపాల్లోని నల్లధనాన్ని బయటికి తెచ్చి.. దేశంలోని నలుపును తీసేసి, అవినీతిరహిత దేశంగా చేయాలి.

LEAVE A REPLY