నగదురహిత జనగామకు సన్నాహాలు

0
22

జనగామను నగదు రహిత జిల్లాగా మార్చేందుకు కలెక్టర్ శ్రీదేవసేన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 13 మండలాలు, 210 పంచాయతీలుండగా, జనాభా 5.84 లక్షలు ఉంది. వీరిలో ఎంతమందికి బ్యాంకు ఖాతాలున్నాయో సర్వే చేపడుతున్నా రు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరితో బ్యాంకు ఖాతా తెరిపించే ప్రయత్నం శుక్రవారం మొదలైంది. బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లి సర్వేలో కలెక్టర్ పాల్గొన్నారు. నగదు రహి త క్రయవిక్రయాలపై అవగాహన కల్పించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారవాణిజ్య వర్గాలతో కలెక్టర్ సమావేశమవ గా, కార్డు స్వైపింగ్ యంత్రాలు అందిస్తే నగదు రహిత లావాదేవీలు ప్రారంభిస్తామన్నారు. అనంతరం అన్ని బ్యాంకుల మేనేజర్లు, అధికారులతో సమావేశమై వారంలోగా కార్డు స్వైపింగ్ యంత్రాలు అందజేయాలని కోరారు.

LEAVE A REPLY