నగదుకు రాంరాం.. డిజిటల్‌కు స్వాగతం

0
17

నోట్లరద్దు అనేది ధైర్యంతోకూడిన, నిర్ణయాత్మకమైన చర్య అని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆర్థిక వ్యవస్థపై అది వృద్ధికారక ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. మరింత బృహత్తరమైన, స్వచ్ఛమైన, అసలుసిసలైన జీడీపీని సృష్టిస్తుందని పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటులో 2017-18 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో నోట్లరద్దు, డిజిటలైజేషన్ చొరవల గురించి ప్రత్యేకంగా వివరించారు. నోట్లరద్దు, జీఎస్టీ వ్యవస్థ కొత్త యుగాన్ని ఆవిష్కరిస్తున్నాయని అన్నారు. మనం అనధికారిక ఆర్థిక వ్యవస్థ నుంచి అధికారిక ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులేస్తున్నాం.. ప్రజాధనానికి ప్రభుత్వాన్ని ఇప్పుడు నమ్మకమైన సంరక్షకునిగా చూస్తున్నారు అని ఆర్థికమంత్రి అన్నారు. నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థను కేవలం తాత్కాలిక కుదుపునకు మాత్రమే గురిచేసిందని, దీర్ఘకాలికంగా అధిక జీడీపీ, అధిక పన్ను ఆదాయం వంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.

LEAVE A REPLY