ధ్వనిని గుర్తించే టెలిస్కోప్!

0
20

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ క్రీ.శ.1668లో కనిపెట్టిన ప్రతిబింబ టెలిస్కోప్ (రిఫ్టెక్టింగ్ టెలిస్కోప్)సూత్రం ఆధారంగా దూరాన వస్తువుల శబ్దాలను, మనుషుల మాటలను వినగలిగే సౌండ్ టెలిస్కోప్‌ను సైతం కనుగొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా లక్నెపల్లి శివారు బాలాజీ ఇంజినీరింగ్ కళాశాల(బిట్స్) రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగ కోఆర్డినేటర్ శీలం సంతోశ్‌కుమార్ దీన్ని రూపొందించారు. శనివారం నిట్ వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆంజనేయులు, బిట్స్ చైర్మన్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి సమక్షంలో ప్రయో గ వివరాలను ఆయన వెల్లడించారు. ఏడాది కాలంగా ప్రయోగాలు చేసి రూ.60 వేలతో రూపొందించామన్నారు. దీన్ని ఉపయోగించి దేశ సరిహద్దుల్లో శత్రువుల కదలికలను, సంభాషణలను పసిగట్టవచ్చన్నారు. ఇప్పటివరకు ఉన్న టెలిస్కోప్‌లు కేవలం దృశ్యాలను చూడటానికే ఉపయోగపడుతాయన్నారు. సింగపూర్‌లో ఈ నెలలో జరుగబోయే ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కాన్ఫరెన్స్‌కు సౌండ్ టెలిస్కోప్ ఎంపికైందని, అక్కడ ప్రదర్శించనున్నట్టు చెప్పారు.

LEAVE A REPLY